NTV Telugu Site icon

TS Election Holiday: వారందరి ఈరోజు సెలవు.. ఉత్తర్వులు జారీ ఎన్నికల అధికారి

Telangana Election

Telangana Election

TS Election Holiday: ఉపాధ్యాయ సంఘం అభ్యర్థన మేరకు ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సెలవు ప్రకటిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. బుధ, గురువారాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

చాలా ప్రాంతాల్లో ఆర్‌వోలకు ఈవీఎంలు అందజేసే సరికి రాత్రి అయింది. ఇవాళ (శుక్రవారం) ప్రత్యేక సెలవు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజక వర్గాల్లో అధికారులు గంటకు నాలుగు గంటల ముందే పోలింగ్‌ను ముగించారు. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరిగింది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడిన వారికి మాత్రమే అధికారులు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

Read also: షుగర్ కంట్రోల్ కావాలంటే ఈ పండు తప్పక తినాలి..!

రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ పూర్తికావడంతో అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించే వరకు ఎన్నికల సిబ్బందిదే బాధ్యత కాబట్టి శుక్రవారం సెలవు ప్రకటించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇవాళ ప్రత్యేక సెలవు ప్రకటించారు. ఈ మేరకు సీఈవో వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు డిసెంబర్ 1న క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల రాత్రి వరకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఆ తర్వాత అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించి మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఉద్యోగులు రాత్రి పూట తమ ఇళ్లకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేదని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక సెలవులు మంజూరు చేశారు.
Telangana Election: ఏంటీ.. ఈ ఊళ్లో పోలింగ్‌ జరగలేదా? మరీ..!