Today Gold Price in Telugu States.
వరుసగా గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో జూలై 4న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,340 వద్ద స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగానే కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,000లుగా ఉంది. కాగా బంగారం ధరలు గత రెండు రోజుల్లో భారీగా పెరిగాయి. రూ. 1450 మేర ర్యాలీ చేసింది. వెండి ధర స్థిరంగానే ఉంది. హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ. 63,500 వద్ద కొనసాగుతోంది.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే.. బంగారం, వెండి ధరలు దేశీ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగితే.. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు మాత్రం పైపైకి ఎగబాకాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.39 శాతం పెరగడంతో.. బంగారం రేటు 1808 డాలర్లకు చేరుకుంది. కాగా బంగారం ధర గత సెషన్లలో 1800 డాలర్ల కిందకు పడిపోయింది. అంటే పసిడి రేటు మళ్లీ పుంజుకుంటోందని చెప్పుకోవచ్చు. అలాగే వెండి రేటు 0.45 శాతం పైకి చేరడంతో.. వెండి ధర ఔన్స్‌కు 19.76 డాలర్లకు వద్ద స్థిరపడింది.
