Telangana Cabinet: నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా.. ఎందుకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయన ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు. దీంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. అయితే మళ్లీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, అక్టోబరు మొదటి వారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా యశోద వైద్యులు సీఎం కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గతంలో కేసీఆర్‌కు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఈసారి కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.
కేబినెట్ సమావేశం జరిగిఉంటే..
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, కొత్త పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే వారు. అలాగే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై చర్చ జరిగింది. వాస్తవానికి గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను గత సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో ఈ అంశంపై పెద్ద దుమారం చెలరేగింది. గవర్నర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. తమిళిసైపై విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను గవర్నర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు?
Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..?
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!