NTV Telugu Site icon

Teenmar Mallanna: నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న తీన్మార్‌ మల్లన్న..

Mallanna Teenmaar

Mallanna Teenmaar

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న (చింత పండు నవీన్ కుమార్) నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలిలో ఉదయం 11 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణానికి మూడు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన వరంగల్- నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు.

Read also: Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన కల్కి

వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే.. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం కూడా తీన్మార్ మల్లన్నకు గెలుపే కోటా రాకపోయినా అత్యధిక ఓట్లు రావడంతో తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారు. గత నెల 27న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ జరగగా.. ఈ నెల 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది.

Read also: AP Cabinet: చంద్రబాబు కేబినెట్‌లో శాఖల కేటాయింపు?.. పవన్‌కు కీలక శాఖలు !

కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవడానికి అవసరమైన ఓట్ల కోటా (1,55,095) ఎవరికీ రాకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? సమీప ప్రత్యర్థి రాకేష్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి లక్ష్యం చేరే వరకు వేచి చూడాలా అని ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్‌ఓ హరిచందన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Nagarkurnool: రూ.21.47 కోట్ల కరెంట్‌ బిల్లు.. ఆ.. అవాక్కయ్యారా..