Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన కల్కి
- కల్కి 2898 ఏడీ సినిమా మీద భారీ అంచనాలు
- ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ ని బద్దలు కొట్టిన కల్కి 2898 ఏడీ
- అత్యంత వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న మొదటి ఇండియన్ సినిమాగా కల్కి 2898 ఏడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Crosses 1 M In USA Pre Sales: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటంతో అన్ని భాషల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అమితా బచ్చన్ దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని వంటి వాళ్ళు ఈ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ ని బద్దలు కొట్టింది. అమెరికాలో కల్కి ప్రీ సేల్స్ వన్ మిలియన్ మార్కును దాటాయి.
Dil Raju: గుండెల్లో, ఏముందో…కళ్ళల్లో తెలుస్తుంది.. భార్యతో దిల్ మామ ఫొటోషూట్ వైరల్
Also Read
సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారాలు ఉండగానే ఈ స్థాయిలో సేల్ జరగడం ఒక రికార్డుగానే చెబుతున్నారు. అంతేకాదు అత్యంత వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న మొదటి ఇండియన్ సినిమాగా కూడా కల్కి రికార్డులకు ఎక్కింది. ఇక ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే విషయం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. సలార్ హిట్టు కొట్టి జోష్ మీద ఉన్న ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా సరికొత్త రికార్డులను సెట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి