పులుల సంచారం పత్తిపంటలపై ప్రభావం చూపుతోంది. వరుసగా పులుల సంచారం పశువులపై పంజా విసురుతుంటే రైతులు, సామాన్య జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు..అటు పశువులే కాదు ఇటీవల కొమురం భీం జిల్లాలో ఓమనిషిని చంపేయడం బెబ్బులి పేరుచెప్పితే చాలు ఊళ్లు బెంబేలెత్తిపోతున్నాయి..పత్తి ఏరేందుకు కూలీలు రాక పంటంతా పత్తిచేనులోనే తారిపోయే ప్రమాదం ఉందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ఇంతకీ ఆదిలాబాద్ ,కొమురం బీం జిల్లాల్లో టైగర్స్ సంచారం పత్తి రైతుల్లో నెలకొన్న ఆందోళన అంతా ఇంతా కాదు.
మొన్నటి వరకు పశువులపై పంజా విసిరిన పులులు ఇప్పుడు మనుషులపై పడుతున్నాయి..పత్తిచేనులో అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది….రెండేళ్ల తర్వాత మరో ప్రాణం తీయడం తో ఉమ్మడి జిల్లా జనం హడలిపోతున్నారు…వలసవచ్చిన పులులకు అడవుల్లో స్థావరాలు లేవా…ఎందుకు శివారు ప్రాంతాలు,పంటపోలాల వైపువస్తున్నాయి..కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై పరుగులు పెట్టడం కలకలం సృష్టిస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పులుల దాడులు కలకలం రేపుతున్నాయి..ఇన్నాళ్ల పాటు వరుసబెట్టి పశువులను చంపేశాయి..తాజాగా కొమురం భీం జిల్లా వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామపంచాయతీ పరిదిలోని ఖానాపూర్ కుచెందిన సిడాం భీము పత్తిచేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది…దాడి చేయడమే కాకుండా కొంత దూరం లాక్కెల్లింది.
తీవ్ర రక్తస్రావం కావడంతో భీము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు…అదే శివారులో పోడు సర్వే చేస్తున్న అటవీశాఖ అధికారులు సమాచారం చేరడంతో చప్పుళ్లు చేస్తూ స్పాట్ కు చేరుకున్నారు..అప్పటికే పులి మనిషిని లోయలో పడేసి పారిపోయిందని క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పారు.. అయితే పులి దాడి చేసిందా..చిరుత పులా అనేది జిల్లా ఉన్నతాధికారులు తేల్చలేదు..పాదముద్రలు సైతం గుర్తించారు అధికారులు…స్థానికులు కళ్లారా పులిని చూశామంటున్నారు…పులిని చూడ్డంతోపాటు మనిషి ప్రాణాలు కోల్పోవడం అటవీ ప్రాంత గ్రామాల్లో పులి పేరు చెప్పితేనే జడుసుకుంటున్నారు..ఒక్క ఖానాపూర్ మాత్రమే కాదు కొమురం భీం జిల్లాలోని వాంకిడి,కాగజ్ నగర్ అటవీ ప్రాంతాలతోపాటు పల్లెలన్నీ బిక్కుబిక్కుమంటున్నాయి.రోజు కో చోట పాదముద్రలు లేదా పులిని చూశామనే జనం చెప్పుతుంటే మరింత భయాన్ని కల్పిస్తున్నాయి.
వారం పది రోజులుగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ ,జైనాథ్ మండలాల్లోని పలు గ్రామాల శివార్లలో ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు పులులు సంచారం వీడియోల రూపంలో వెలుగులోకి వచ్చింది..అలా పులులు రోడ్డెక్కాయో లేదో మరుసటి రోజే గుంజాల అటవీప్రాంతంలో ఓ ఆవుదూడను చంపేసింది..దాని తర్వాత పిప్పల్ కోటీ శివారులో లేగ దూడ పై దాడి చేసింది పులి..అయితే అది గాయాలతో ఇంటికి చేరింది.ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కొమురం భీం జిల్లాలో పులి దాడిలో భీము అనే రైతు ప్రాణాలు కోల్పోవడం ఉమ్మడి జిల్లా జనంలో వణుకుపుట్టిస్తోంది.
2020 నవంబర్ లో దిగిడలో విష్నేష్ అనే యువకుడి చంపేసిన పులి ఆతర్వాత కొద్ది రోజులకే పెంచికల్ పేట మండలం కొండపల్లిలో పసుల నిర్మల అనే బాలికను చంపేసింది…ఈరెండు మరణాలు జరిగిన సరిగ్గా రెండేళ్లకు అదే నవంబర్ నెలలో ఇప్పుడు మరో వ్యక్తి పులికి బలి కావడం విషాదాన్ని నింపింది..అటవీ ప్రాంతం మద్యలో ఉన్న చేనులో పత్తిఏరుతుండగా పులి దాడి చేసి 50 మీటర్ల వరకు లాక్కెల్లిందని స్థానికులు చెప్పుతున్నారు..అంతకంటే ముందే గోందిగూడ లో ఆపులి ఓదూడపైన దాడి చేసింది కాకపోతే అది తప్పించకపోయింది…అంతేకాదు పశువుల కాపర్లు కేకలు పెట్టడం బెదిరించడంతో పరుగులు పెట్టిన పులి గుట్టపైకెక్కి అక్కడ పత్తి ఏరే సిడాం భీము పై దాడి చేసిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.
పులి దాడి చేసి చంపిందంటే అటవీశాఖ అధికారులు మాత్రం ఇంకా పులా,చిరుతనా అనేదానిపై క్లారిటి తెచ్చుకుంటున్నామంటున్నారు…దాడి జరిగిన మరుసటిరోజే నార్లపూర్ ,భీంపూర్ దారిలో పాదముద్రలు గుర్తించారు..అంతేకాకుండా దాడి జరిగిన ప్రదేశంలో పాదముద్రలు లభించాయి..అలాగే వెంట్రుకలు సైతం సేకరించారు..అయితే దాన్ని టెస్ట్ నిమిత్తం హైదరాబాద్ కు పంపామని అది పులినా చిరుతపులినా అనేది క్లారిటి రావాల్సి ఉందంటున్నారు డీఎఫ్ ఓ., దాడి చేసి పులి అడుగు జాడల కోసం జిల్లాలోని రైల్వే ట్రాక్ ,అలాగే కాగజ్ నగర్ ,పెద్దవాగు శివారు ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ చేస్తోంది అటవీశాఖ సిబ్బంది. దాడి చేసింది మ్యాన్ ఈటర్ కాదంటున్నారు అధికారులు.
పులి భయంతో పంటపొలాల వైపు వెళ్ళాలంటేనే జనం జంకుతున్నారు .మహిళలు పత్తిఏరుతుంటే కాపలా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.అసలు కొన్ని ప్రాంతాల్లో పులి భయంతో కూలీలు రావడం లేదని దానివల్ల పత్తి పంటపొలంలోనే ఉందంటున్నారు రైతులు. కొమురం బీం జిల్లాలో పరిస్థితి ఆవిధంగా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో అయితే పులుల సంచారంలో మనుషులు హడలెత్తి పోవాల్సి పరిస్థితి ఏర్పడింది.
పులులను చూసి పశువుల పరుగులు పెడుతుంటే పత్తిచేనుల వైపు వెళ్ళాలంటే కూలీలు జడుకుంటున్నారు. పులులు మహరాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి పెనుగంగా దాటి వస్తున్నాయి..కొమురం భీం జిల్లాకు తడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి రాకపోకలు సాగించే క్రమంలో పశువులు కంటబడితే చంపేస్తున్నాయి..వచ్చిన పులులు ఆవాసం కోసం ఆగమాగం తిరగుతున్నాయి..ఈక్రమంలో అక్కడక్కడ రోడ్లపై కాల్వల్లో సంచరిస్తున్నాయి..అవి జనం కంట పడడం పల్లెల్లో జనం భయంగుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు..అసలే పత్తి ఏరే సీజన్ కాబట్టి ఇబ్బందులు ఎదురౌతున్నాయంటున్నారు..కొంతమంది కాపాల ఉంటే మరికొంతమంది పత్తి ఏరుతున్నామని పులి భయానికి కూలీలు రావడంలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదిఏమైనా పులులు పక్కరాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వస్తే అటవీశాఖకు ఆనందంమే ..జనంకు సైతం ఇబ్బంది ఏమీ లేదు..కాని మనుషులు ,పశువులను చంపేస్తేనే ఇబ్బంది..అలాంటప్పుడు అధికారులు పులులు జనావాసాలవైపు రాకుండా చూడాలి..దాడులు చేసే పులులను పట్టుకెల్లాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు…మహరాష్ట్రలో వరుసబెట్టి మనుషులను చంపే పులులు ఇటు వైపు వస్తే గనుక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించలేం…కాబట్టి పులి రక్షణతోపాటు జనం,పశుసంపద రక్షణ కోసం అటవీశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.