NTV Telugu Site icon

Tiger in Asifabad: కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం.. రోడ్డు దాటుతుండగా..

Tiger In Asifabad

Tiger In Asifabad

Tiger in Asifabad: గత కొద్దిరోజులుగా ఆదిలాబాద్‌ జిల్లాలో పులులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం సృష్టించింది. ఆపట్టణంలోని వినయ్‌ గార్డెన్‌ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూసి భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులకు ఘటనా స్థలానికి చేరుకుని పులి పాదముద్రలు సేకరించి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక, పులి జాడను వీలైనంత తొందరగా కనిపెట్టాలని అధికారులు ఆదేశించారు. అయితే.. పులి సంచరిస్తున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయట తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈఏడాది అక్టోబర్‌ 28న కూడా కాగజ్‌నగర్‌లో పెద్దపులి కనిపించింది. గతకొద్ది రోజులుగా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో సంచరిస్తున్న పులి, పశువులపై దాడిచేస్తుంది. అంతేకాదు ఇలా వారం రోజుల వ్యవధిలో ఎనిమిది పశువులను చంపి తినేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక డివిజన్‌లోని వేంపల్లి, కోసిని, అనుకోడ, అంకుశపూర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతుందని అటవీశాఖ అధికారులు త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Read also: Twitter : ఎలాన్ మస్క్‎కు ఉద్యోగుల షాక్.. ట్విట్టర్‎కు వందలాది మంది గుడ్ బై

ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పులుల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్లు వరుసబెట్టి పశువులను చంపేశాయి.. తాజాగా కొమురం భీం జిల్లా వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖానాపూర్ కుచెందిన సిడాం భీము పత్తిచేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది. దాడి చేయడమే కాకుండా కొంత దూరం లాక్కెళ్లింది.. తీవ్ర రక్తస్రావం కావడంతో భీము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే శివారులో పోడు సర్వే చేస్తున్న అటవీశాఖ అధికారులు సమాచారం చేరడంతో చప్పుళ్లు చేస్తూ స్పాట్ కు చేరుకున్నారు. అప్పటికే పులి మనిషి లోయలో పడేసి పారిపోయిందని క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పారు.. అయితే పులి దాడి చేసిందా.. చిరుత పులా అనేది జిల్లా ఉన్నతాధికారులు తేల్చలేదు.. పాదముద్రలు సైతం గుర్తించారు అధికారులు. స్థానికులు కళ్లారా పులిని చూశామంటున్నారు. పులిని చూడ్డంతోపాటు మనిషి ప్రాణాలు కోల్పోవడం అటవీ ప్రాంత గ్రామాల్లో పులి పేరు చెబితేనే జడుసుకుంటున్నారు.
Cold for Health: ఆరోగ్యానికి చలి ముప్పు.. వీరు జాగ్రత్త!