Site icon NTV Telugu

TiE Global Summit: అంతర్జాతీయ సదస్సుకు మరోసారి వేదిక కాబోతోన్న హైదరాబాద్‌

Tie

Tie

హైదరాబాద్‌ సిటీ వేదికగా ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు జరిగాయి.. ఇప్పుడు విశ్వనగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.. ఈ నెల 12వ తేదీ నుంచి నోవాటెల్ హెచ్‌ఐసీసీలో ది ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (టీఐఈ) గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. 12వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈవో శంతను నారాయణ్‌, గోయెంకా గ్రూప్‌ సీఈవో, ఎండీ అనిల్‌ కుమార్‌ చలమలశెట్టి హాజరవనున్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు పలు దేశాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు.. అంతర్జాతీయ సదస్సుతో రాష్ట్రంలో స్టార్టప్‌ సంస్కృతి మరింత విస్తరిస్తుందని ఆశాభావం ఇప్పటికే వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్..

Read Also: Uniform Marriage Age: మతంతో సంబంధం లేకుండా అమ్మాయిలందరికీ ఒకే వివాహ వయస్సు..!

ఈ సదస్సులో ఆరు ఖండాల నుంచి 2,500 మంది ప్రతినిధులతో పాటు.. 17 దేశాలకు చెందిన 550 మందికి పైగా టీఐఈ చార్టర్‌ మెంబర్స్‌, 150 మందికి పైగా గ్లోబల్‌ స్పీకర్స్‌, 200 మందికి పైగా పెట్టెబడిదారులు పాల్గొనబోతున్నారు.. TiE గ్లోబల్ సమ్మిట్ – హైదరాబాద్ అతిపెద్ద వ్యవస్థాపక శిఖరాగ్ర సమావేశాలలో ఒకటిగా చెబుతున్నారు.. భవిష్యత్ సాంకేతికత, నూతన యుగ వ్యవస్థాపకత మరియు స్థిరత్వం అనే మూడు విస్తృత థీమ్‌లపై ఈ కార్యక్రమం దృష్టి సారించబోతోంది.. ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ విద్య, మార్గదర్శకత్వం, నిధులు, నెట్‌వర్కింగ్ మరియు ఇంక్యుబేషన్ ద్వారా వ్యవస్థాపకుల వృద్ధికి కృషి చేసే సంస్థ. “ఈ సమ్మిట్‌లో స్పీకర్ రౌండ్ టేబుల్ అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను కలిగి ఉంటుంది.. ఇందులో భాగంగా, ప్రసంగం తర్వాత క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో కొన్ని ఎంపిక చేసిన క్యూరేటెడ్ స్టార్టప్‌లతో స్పీకర్లు రెండు గంటలు గడపవలసి ఉంటుంది. అటువంటి సమావేశంలో, వక్తలు తమ 500 రోజుల వ్యవస్థాపక ప్రయాణాన్ని స్టార్టప్‌లకు వివరిస్తారు. స్టార్టప్‌లను స్థాపించిన ముప్పై ఎనిమిది మంది మహిళా పారిశ్రామికవేత్తలు డిసెంబర్ 12న జరిగే సెమీ-ఫైనల్‌లో పాల్గొంటారు. మరుసటి రోజు, ఆరుగురు ఫైనలిస్టులు TiE గ్రాంట్ కోసం పోటీ పడతారు.

Exit mobile version