Site icon NTV Telugu

Thummala Nageswara Rao : హాట్‌ కామెంట్స్.. రాజకీయ ద్రోహులను నమ్మకూడదంటూ..

Former Minister Thummala Nageswara Rao Made Sensational Comments.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాజకీయంగా శత్రువులను నమ్మచ్చు గాని రాజకీయ ద్రోహులు మాత్రం నమ్మవద్దంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. శత్రువులు పక్క పార్టీలో వెళ్ళిపోతారు ద్రోహులు మాత్రం పార్టీకి ద్రోహం చేసి ఓడిస్తారని ఆయన విమర్శించారు. ద్రోహాన్ని మీరు చూసుకోండి మళ్ళీ మీ ముందుకు నేనువస్తానని ఆయన అన్నారు.

నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పథంలో ఉంచేందుకు అన్ని పథకాలను అమలుచేసి అగ్రగామిగా నిలిపానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదార స్వభావంతో పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లాకి ఇచ్చిన అభివృద్ధి పథకాలను పూర్తి చేసే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. మిగిలి ఉన్న అభివృద్ధి పనులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి పూర్తి చేస్తానని ఆయన వెల్లడించారు. మీరు నాకు ఇచ్చిన అపూర్వ స్వాగతానికి జన్మ జన్మలు రుణపడి ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు.

https://ntvtelugu.com/kodanda-reddy-made-comments-on-11-go/
Exit mobile version