Thummala Nageswara Rao: అశ్వారావుపేట సమితిగా ఉన్నపుడు నేను అందరిని పోటీ చేయాల్సిందిగా కోరెను. ఎవరూ రాకపోవడంతో నేనే పోటీలోకి వచ్చానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి నియోజకవర్గం లేని అభివృద్ధి మన అశ్వారావుపేట నియోజకవర్గానికి అభివృద్ధి చేసానని అన్నారు. అలానే ఉమ్మడి రాష్ట్రంలో ఓ నలుగురు ముఖ్యమంత్రి నియోజకవర్గ లకు కూడా నేను మంత్రిగా ఉన్నపుడు అభివృద్ధి చేశాను. హైదరాబాద్ రింగ్ రోడ్డు చంద్రబాబు హయాంలో నేనే ఘట్కరితో దగ్గర మాట్లాడి సెక్షన్ చేయించానన్నారు. రెండోసారి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ కూడా నేనే కష్టపడ్డ అని గుర్తు చేశారు. నేను అభివృద్ధి చేయడానికి ఎన్టీఆర్ పుణ్యమే అని అన్నారు. నేను ఏ ప్రభుత్వంలో పనిచేసిన ఆ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి మంచి పెరు వచ్చేలా నేను పనిచేశానని చెప్పుకొచ్చారు.
Read also: Calcutta High Court: నలుగురు ఉగ్రవాదుల మరణశిక్ష రద్దు.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
నా పదవి కాలంలో చేసిన పనులు నేను పదవిలో ఉన్న లేకున్నా సమాజానికి ప్రజలకు ఉపయోగపడేలా చేశానన్నారు. వ్యక్తిగతంగా ఎవరికి నా వల్ల లబ్ది ఉండదు.. సమాజానికి ప్రజలకు ఉపయోగపడేలా మాత్రమే నా పనులు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో భారీ ప్రాజెక్టులు మొత్తం నేనే కట్టించానని తెలిపారు. నా నియోజకవర్గ చూసి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ నా నియోజకవర్గం లాగా అభివృద్ధి అయ్యేలా మాట్లాడుకోవాలి అనేది నా ఉద్దేశమన్నారు. నా ఉద్దేశం అభివృద్ధి విషయం ఈ ప్రాంతంలో ఉన్నవారు ఆనందపడలి పక్క ప్రాంతం వాళ్ళు అసూయ పడాలి, మనం ఇక్కడ ఎందుకు లేము అని అంటూ తెలిపారు. గోదావరి జలాలు అశ్వారావుపేట నుండి పాలేరు వరుకు అన్ని చెరువుల్లో గోదావరి జలాలు రావాలన్నారు. అలా వస్తే 10 లక్షలు ఎకరాలు సేద్యంలోకి వస్తాయని గుర్తు చేశారు. గోదావరి జలాలు వస్తే 50 అడుగుల్లో గ్రౌండ్ వాటర్ వస్తుందని చెప్పారు.ఇప్పుడంటే కరెంట్ ఇబ్బంది లేకున్నా రానున్న రోజుల్లో కరెంట్ ఇబ్బంది అయితే రైతుకు భారం కాకుండా ఉండాలనేది నా ఉద్దేశమన్నారు.
Read also: Minister Peddireddy Ramachandra Reddy:డిమాండ్ కు తగిన విధంగా విద్యుత్ సరఫరా
అలా గోదావరి జలాలు ఉమ్మడి జిల్లాలకు వస్తే నా రాజకీయ జీవితానికి తృప్తిని ఇస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి భద్రాచలం వస్తే ఇంపోర్ట్ డ్యూటీ కోసం కేసీఆర్ ని కేంద్రాన్ని అడగలంటూ కోరానన్నారు. రైతులు ఒక పాయింట్ నష్టపోతే కొన్ని వేలమంది నష్టపోతారు.. అదే ఒక్క పాయింట్ ఎక్కువ వస్తే ఇప్పుడు 5 కారులు ఉన్నవారు 10 కారులు వస్తాయన్నారు. నా ఆత్మీయులందయికి నేను చెప్పొచ్చేది మీరందరు ధర్మం వైపు ఉండండి, నేను మీకు ఏమి ఇవ్వలేకపోయిన మీ జీవితాలు బాగుపడాలి అంటే అభివృద్ధి చేస్తా.. నా జీవితాన్ని త్యాగం చేస్తానని అన్నారు. ఎవడుస్తే వాడి వెనుక పోతే మీ గౌరం ఏముంటుందని తెలిపారు. ఆంజనేయ స్వామి సాక్షిగా అడుగుతున్న నేను ఓడిపోయాక నేను ఈ పని చేశానని ఒక్కరినీ చెప్పమనండి అంటూ ప్రశ్నించారు. నాకు రాజకీయ జన్మ ఇచ్చిన అశ్వారావుపేట మండలాన్ని మర్చిపోయేది లేదన్నారు. మీరుకుడా చేసింది ఏంటి.. చేసేదే ఏంటి అనేది కూడా చూసుకోండన్నారు. సత్తుపల్లి పాత నియోజకవర్గనికి నేను రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
CM KCR: వైద్య రంగంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం