జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువతులు మృత్యువాత పడ్డారు. జగిత్యాల పట్టణంలోని గాంధీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గుట్ట వద్ద గల ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురి యువతుల మృతిచెందారు. ఇందులో ఇద్దరికి వివాహం కాగా, ఇంకో యువతి ఇంటర్ చదువుతోంది.
మరణించిన వారిలో ఎక్కల్ దేవి గంగాజల, మల్లిక ల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో యువతి వందన మృత దేహం కోసం గాలింపు కొనసాగుతోంది. యువతుల మృతి ఘటనపై కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు టౌన్ సిఐ కిషోర్.