జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువతులు మృత్యువాత పడ్డారు. జగిత్యాల పట్టణంలోని గాంధీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గుట్ట వద్ద గల ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురి యువతుల మృతిచెందారు. ఇందులో ఇద్దరికి వివాహం కాగా, ఇంకో యువతి ఇంటర్ చదువుతోంది. మరణించిన వారిలో ఎక్కల్ దేవి గంగాజల, మల్లిక ల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో యువతి వందన మృత దేహం కోసం గాలింపు కొనసాగుతోంది. యువతుల మృతి ఘటనపై…
రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద ఈ నెల 1న గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది. సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెళ్లెల్లు, తమ్ముడు. తమ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై గోదావరిలో దూకి అత్మహత్య చేసుకున్నారు కుమార్తెలు, కుమారుడు. మృతులు ప.గో.జిల్లా కొవ్వూరు బాపూజీనగర్ కు చెందిన అక్క మామిడిపల్లి కన్నా దేవి (34) చెల్లెలు నాగమణి (32), తమ్ముడు దుర్గారావు (30) గా గుర్తించారు.…