Three People Drowned in the River: రాష్ట్రంలో భారీ వర్షాలకు జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాగులు దాటుతూ గ్రామాలకు వెళ్లాల్సివస్తుంది. వాగులు దాటుతున్నప్పుడు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక వనపర్తి జిల్లా మదనాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఎగువన సరళ సాగర్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ సైఫన్స్ తెరుచుకోవడంతో కాజ్ వే పై నుంచి నీరు ప్రవహిస్తుంది. నదిపై నిర్మించిన లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు మహిళలతో వస్తున్న వ్యక్తి కాజ్ వే దాటుతుండగా.. అదుపు తప్పి బైక్‌తో సహా నదిలో పడిపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముగ్గురు కొట్టుకుపోతున్నారు. అక్కడే ఉన్న ముగ్గురు యువకులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
Read also: Samantha Ruth Prabhu: వెనక్కి తగ్గా, ఔట్ అవ్వలేదు.. సమంత పోస్ట్ వైరల్
సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన వారిని సంతోషమ్మ, పరిమళ, సాయికుమార్‌గా గుర్తించారు. వీరంతా కౌకుంట్ల కు చెందిన వారు. కొత్తకోట నుంచి వస్తుండగా జరిగిందని తెలిపారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే గత నెలలో ఓ ప్రయివేట్ టీచర్ గల్లంతైన విషయం తెలిసిందే. వాగు దాటుతుండగా టీచర్ గల్లంతయ్యారని గ్రామస్తులు తెలిపారు.
Samantha Ruth Prabhu: వెనక్కి తగ్గా, ఔట్ అవ్వలేదు.. సమంత పోస్ట్ వైరల్