Samantha Ruth Prabhu: వెనక్కి తగ్గా, ఔట్ అవ్వలేదు.. సమంత పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Post Going Viral On Social Media: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సినీ తారల్లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా రెగ్యులర్‌గా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి సమంత.. కొంతకాలం నుంచి యాక్టివ్‌గా లేదు. చివరిసారిగా సెప్టెంబర్ 23న తన సినిమా గురించి ఒక పోస్ట్ పెట్టిన ఈ భామ, ఆ తర్వాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఓవైపు సర్జరీ అంటూ, మరోవైపు అనారోగ్యానికి గురైందంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నా.. సమంత నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో.. ఏమైందన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.
ఇలాంటి తరుణంలో.. సమంత లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి చర్చనీయాంశం అవుతోంది. దిండు వెనకాల దాక్కున్న తన పెంపుడు కుక్క ఫోటో పెట్టి.. ‘‘వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు’’ (Down But Not Out) అని క్యాప్షన్ రాసింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత సమంత పోస్ట్ పెట్టడం, అది కూడా క్యాప్షన్ దయనీయంగా ఉండటం చూసి.. కొందరు సెలెబ్రిటీలు స్పందించారు. ‘‘మోర్ పవర్ టు యూ, ధైర్యంగా ఉండు’’ అని అర్థం వచ్చేలా ఎమోజీలతో కామెంట్స్ పెట్టి, ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అటు.. అభిమానులు కూడా ‘ఏమైంది మేడమ్, ధైర్యంగా ఉండండి’ అంటూ ధైర్యం చెప్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి సమంత ఈ విధంగా పోస్ట్ పెట్టి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read
ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఈ అమ్మడు మరింత జోరు పెంచింది. ఓవైపు వెబ్ సిరీస్‌లతో పాటు మరోవైపు వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఆమె చేస్తోన్న సినిమాల్లో ‘యశోద’, ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..