Site icon NTV Telugu

BJP Training Classes: ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు బీజేపీ శిక్షణ తరగతులు..

Bjp Training Classes

Bjp Training Classes

BJP Training Classes: ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌చుగ్‌ ప్రారంభిస్తారు. అనంతరం పార్టీలో పలువురు కొత్త నాయకులు చేరిన నేపథ్యంలో వారితో పాటు రాష్ట్ర నాయకులకు పార్టీ సిద్ధాంతాలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే దిశగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో.. ప్రధానంగా బీజేపీ నేపథ్యం, సైద్ధాంతిక భూమిక, ఆరెస్సెస్‌తో పార్టీ సంబంధాలు, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానంతో దేశానికి కలిగిన ప్ర యోజనాలు తదితర అంశాలపై వివరించనున్నారు. ఇక, ప్రారంభం, ముగింపు కార్యక్రమాలతో కలిపి మొత్తం 14 సెషన్స్‌ ఉంటాయని పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. బీజేపీ.. మోడీ సర్కార్‌ సాధించిన విజయాలపై కిషన్‌రెడ్డి, విదేశాంగ విధానంపై విజయ్‌ చౌతేవాలా.. సంస్థాగత అంశాలపై సునీల్‌ బన్సల్, పార్టీ చరిత్రపై మురళీధర్‌రావు, సాంస్కృతిక జాతీయ వాదం అంశాలపై ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న ఇద్దరు నేతలు ప్రసంగించనున్నారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి జి. కిషన్‌ రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌, జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాశ్, జాతీయకార్యదర్శి అరవింద్‌ మీనన్, బీజేపీ ప్రశిక్షణ్‌ కమిటీ జాతీయ ఇన్‌చార్జి పి. మురళీధర్‌రావు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వరకు ఈ తరగతులు జరుగుతాయి. అయితే సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు దాదాపు 300 మంది నాయకులు తరగతులకు హాజరు కానున్నారు. అయితే.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈ నెల 21న తమ ఎదుట హాజరుకావాలంటూ సిట్‌ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ హాజరవుతారా? లేదా? అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Himanta Biswa Sarma: మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదు.. చరిత్రను తిరగరాయాలి..

Exit mobile version