Site icon NTV Telugu

పనిచేసే వారిని చేయనివ్వరు వారు చేయరు: కడియం శ్రీహరి

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కడియం శ్రీహరి మాటల దాడులను పెంచారు. ఆయన ఏకంగా కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలను బేవకూఫ్‌లు అని సంబోధించారు. బీజేపీ రైతులపై చిత్తశుద్ధి ఉంటే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ, కాంగ్రెస్‌లకు దమ్ము లేదని రాజకీయ పబ్బం గడుపుకోవడానికే రైతులను అడ్డం పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. పనిచేసే వారిని చేయనివ్వరు వారు చేయరు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులకు రైతులపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌నేతలు చర్చకు పట్టు పట్టిన బీజేపీ చర్చకు ఆహ్వానించలేదన్నారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రి ఉన్న తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేకపోతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని కడియం శ్రీహరి అన్నారు.

Exit mobile version