This election is not a sentimental exercise: ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సంచరాలు జరుగుతున్న వేళ బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్ సంచళన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదని ఎద్దేవ చేశారు. నల్లగొండ నియోజకవర్గంలో ప్రజాగోస – బీజేపీ భరోసాయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ శ్రేణులు ఈటెల రాజేందర్ కి ఘన స్వాగతం పలికారు. పానగల్లు లోని పచ్చల సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈటెల. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఏర్పాటుతో కెసిఆర్ కు తెలంగాణ ప్రజానీకానికి బంధం తెగిపోయిందని అన్నారు.
Read also: Loan on Credit Card: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా..? ఇవి తెలుసుకొండి..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు. బీఆర్ఎస్ ఏర్పడిన నాడే తెలంగాణతో బంధం కేసీఆర్ కు తెగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ లేకుండా గెలవలేమని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుందని ఎద్దేవ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీతో కలసి సజ్జల రామకృష్ణారెడ్డి సెంటిమెంటును రగిలించేందుకు తెర లేపారని ఆరోపించారు. టీఆర్‌ఎస్, వైసీపీల డ్రామాలు ప్రజలు నమ్మరని అన్నారు. 2018లో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది కానీ.. ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదంటూ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Shraddha Walker Case: అఫ్తాబ్ పూనావాలా జ్యూడీషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు