Municipal in Illandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయేటట్లు చేసేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది .ఇల్లందుకి చుట్టూ ఉన్న మూడు జిల్లాలకు సంబంధించిన పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సరిహద్దులో కౌన్సిలర్ల కోసం పెద్ద ఎత్తున నిఘా పెట్టి వారికోసం తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పై బిఆర్ఎస్ అవిశ్వాసం పెట్టింది. గతంలోనే రెండుసార్లు అవిశ్వాసం పెట్టినప్పటికీ అప్పుడున్న అధికార పార్టీ అవిశ్వాసం కౌన్సిల్ లో చర్చకు రాకుండా చేసింది .కానీ ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం పెట్టడంతో జిల్లా కలెక్టర్ అవిశ్వాసం పై చర్చకు ఆదేశాలు జారీ చేయగా ఈరోజు కొద్దిసేపట్లో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వర రావు ఫై అవిశ్వాసం ఓటింగ్ జరగనుంది. అయితే 24 కౌన్సిలర్ ఎమ్మెల్యే కో ఆప్షన్ తో కలుపుకుని 25 మంది వార్డు సభ్యులు ఉండగా అందులో 17 మంది హాజరై తేనే కోరం పూర్తయినట్లు.. 17 మందిలో ఒక్కలు తగ్గిన సరే అవిశ్వాసం వీగిపోయినట్లే అవుతుంది.
Read also: CM Revanth Reddy: నేడు రాంచీకి రేవంత్.. న్యాయ్ యాత్రలో పాల్గొననున్న సీఎం..
అలా విగి పోయే విదముగా కాంగ్రెస్ వ్యూహం పన్నింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన 17 మందిలో కొద్దిమందిని రాకుండా చేయడం ద్వారా అధికార కాంగ్రెస్ వ్యూహము అనుసరిస్తుంది .ఇప్పటికే గోవా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు రాకుండా చేయడం కోసం పోలీసు యంత్రాంగం కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ఇల్లందుకు వెళ్లే వాహనాన్ని ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కారులు వాళ్ళని ఆపి తనిఖీ చేసి ఇల్లందుకి వెళ్తున్నారా అని ఆచూకీ తెలుసుకుంటున్నారు అయితే ఇప్పటివరకు బిఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నదనేది అధికార కాంగ్రెస్ పార్టీ కని పెట్టలేకపోయింది. మరోవైపున తమకి రక్షణ కల్పించాలని కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు .అంతే కాకుండా హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు కూడా రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కౌన్సిలర్లు మాత్రం భయం నెలకొని ఉంది తాజాగా జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అధికార పార్టీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది.
Anupama Parameswaran : స్టేజ్ పైనే డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అనుపమ.. వామ్మో ఇలా చేసిందేంటి?