Site icon NTV Telugu

రాష్ర్టంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుంది: ఈటల రాజేందర్‌

జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని శివమ్ గార్డెన్ లో జరుగుతున్న BJP జనగామ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటల రాజేందర్ హుజారాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తరువాత మొదటిసారి జిల్లాకు రావడంతో బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ ..కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందన్నారు. దీనిని నియంత్రించే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ఒకప్పుడు పార్లమెంటులో రెండు స్థానాలు కలిగి ఉన్న బీజేపీ నేడు మూడువందల పార్లమెంట్‌ స్థానాలను కలిగి దేశాన్ని పరిపాలిస్తుందన్నారు.

2023 లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనాన్ని ఎవ్వరు ఆపలేరన్నారు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా, ప్రపంచ చరిత్రలో అత్యంత నికృష్టమైన, నీచమైన పనికి ఒడిగట్టింది కేసీఆర్‌ మాత్రమేనని విమర్శించారు. నన్ను అన్నివిధాలుగా నాశనం చెయ్యడానికి నియోజకవర్గంలో మొత్తం 600 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కానీ నా హుజురాబాద్ ప్రజలు వారికి రాజ్యాంగ ప్రకారం ఉన్నస్వేచ్ఛ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం పోసి నన్ను గెలిపించారని ఈటల రాజేందర్‌ అన్నారు.

Exit mobile version