NTV Telugu Site icon

Bike Thief: దైవ దర్శనానికి వచ్చాడు.. పూజారి బైక్ ఎత్తుకెళ్లాడు

Bike Thief

Bike Thief

హైదరాబాద్ నగరంలో నిత్యం ఏదో ఓ చోట బైకు చోరీలకు సంబంధించిన ఘటనల గురించి వింటునే ఉంటాం. సామాన్యుల బైకుల చోరీలకు గురవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. అయితే ఏకంగా పూజారి బైక్‌నే దొంగలించడం సర్వత్రా చర్చనీయాంశానికి దారితీస్తోంది.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ వేంకటేశ్వర ఆలయంలో రోజూలాగే ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి తన బైక్‌ ను ఆలయం వద్ద పార్కింగ్‌ చేసి ఆలయంలోపలికి వెళ్లాడు. రోజూలాగే హుండీ వద్ద పూజారీ బైక్‌ తాళాలు పెట్టి ఆయన పనిలో నిమగ్నమై పూజలు చేసుకుంటుంటారు. ఇది సరామామూలుగానే జరిగే పని అయితే.. ఇదే అలుసు భావించిన ఓ యువకుడు సోమవారం సాయంత్రం ఆలయానికి వచ్చి దేవునికి దర్శించుకున్నాడు. ఆ యువకునికి తీర్థప్రసాదాలు అందజేసి మంగళ హారతి తీసుకొని గర్భగుడిలోకి పూజారి వెళ్లారు. అయితే అక్కడే హుండీ దగ్గర వున్న బైక్‌ కీస్‌ ఆయువకుడు గమనించి దాన్ని తీసుకుని బయటకు వెళ్లి బైక్‌ ను స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోయాడు. పూజారికి హుండీ దగ్గర బైక్‌ కీస్‌ లేకపోవడంతో.. అనుమానం వచ్చిన పూజారి ఆలయం బయటకు వచ్చి చూడగా బైక్‌ మాయమైంది. దీంతో అయ్యవారు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి సీసీ ఫోటేజ్‌ అధిరంగా దొంగను పట్టుకునే చర్యలు చేపట్టారు.

అయితే గత మాసం 22న నగరంలోని హుమాయూన్‌నగర్‌, ఆసిఫ్‌నగర్‌, గోల్కొండ, బంజారాహిల్స్‌, లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. చోరీ చేసిన వాహనాలను స్థానికంగా ఉండే సయ్యద్‌ నాబి, అబ్దుల్‌అల్తాఫ్‌, మహ్మద్‌ ఫెరోజ్‌లకు ఒక్కో వాహనాన్ని రూ.10వేలకు చొప్పున విక్రయించాడు. స్థానిక సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Mahatma Gandhi NREGS: ‘మహాత్మాగాంధీ’ని కాదని.. మరో ‘ఉపాధి’.