Site icon NTV Telugu

Ujjaini Mahankali Bonalu: వైభవంగా లష్కర్ బోనాలు.. నేడు భవిష్యవాణి కార్యక్రమం

Ujjaini Maha Kali Temple

Ujjaini Maha Kali Temple

లక్సర్ బోనాలు నిన్న సికింద్రాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం తెల్లవారుజామునుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, సారె, సమర్పించారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తొలి బోనం సమర్పించగా, ఎమ్మెల్సీ కవిత 2000 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈనేపథ్యంలో.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

భవిష్యవాణి..

అయితే బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టం రంగం ఇవాళ జరగనుంది. ఈ రంగంలో అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించిన అమ్మవారు భవిష్యవాణి పలకనుంది. దీన్నే రంగం అంటారు. అయితే ఈ రంగంలో అమ్మపలికే వాక్కు నిజమవుతుందని భక్తుల విశ్వాసం. కాగా.. భవిష్యవాణి అనంతరం అమ్మవారి… అంబారి ఊరేగింపు వైభవంగా సాగనుంది. అయితే.. అంబారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో, అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే.. నేడు సాయంత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగనుంది. ఈనేపథ్యంలో.. నగరంలోని దాదాపు 40కిపైగా ప్రాంతాల నుంచి ఫలహారం బండ్లు వస్తాయని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అయ్యే ఈ వేడుక అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. అయితే.. ఫలహారం బండ్ల ఊరేగింపుతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పూర్తి కానుంది.

Presidential Poll 2022: రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధం

Exit mobile version