NTV Telugu Site icon

Ekalavya Model School: ప్రిన్సిపల్‌, వార్డెన్‌, అటెండర్‌ వేధిస్తున్నారు.. రోడ్డెక్కి విద్యార్థినిలు ఆందోళన

Ekalavya Model School

Ekalavya Model School

Ekalavya Model School: విద్యార్థినులపై వేధింపులు, దురుసుగా ప్రవర్తించడం పై ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. వారికి వార్నింగ్‌ లు ఇస్తున్నా.. అయినా వారిపై స్కూల్‌ యాజమాన్యం మాత్రం అలానే ప్రవర్తిస్తూ.. నరకయాతన చూపిస్తున్నారు. వారిని వేధిస్తూ అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థినులు ఎదురు తిరిగితే వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ నరకాన్ని చూపిస్తున్నారు. దీంతో విసుగు చెందిన విద్యార్థినులు రోడ్డెక్కారు. న్యాయం జరగేంత వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. ఈఘటన దుమాల గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ వద్ద చోటుచేసుకుంది.

Read also: Chain Snatchers: వరుస చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు.. నగరంలో పోలీసుల తనిఖీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ తెల్లవారుజామున 5 గంటలకే దాదాపు 50 మంది విద్యార్థినిలు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థినులకు విద్యార్థి సంఘాలు మద్దతు పలికారు. విద్యార్థులను స్థానిక అధికారులు బుజ్జగిస్తున్నారు. తమకు న్యాయం చేసేంతవరకు కదిలేది లేదంటూ చలిలోనే విద్యార్థినిలు భీష్ముంచు కూర్చున్నారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తగిన బుద్ది చెప్పాలని చెలిని సైతం లెక్కచేయకుండా న్యాయం కోసం రోడ్డు పై బైఠాయించడం చర్చకు దారితీసింది. విద్యార్థినిలపై అధికారులు ఎంతగా వేధించి వుంటే విద్యార్థినులు సహనం కోల్పోయి వుంటారని స్థానికులు చెబుతున్నారు. వారిపై నమ్మకంతో పిల్లల తల్లిదండ్రులు వదిలి వెళితే.. ఇదే అలుసుగా భావించి ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి పిల్లలను వేధించడం సరైన పద్దతి కాదని చెబుతున్నారు. వారికి తగిన బుద్డి చెప్పాలని కోరుతున్నారు. విద్యార్థినులకు న్యాయం చేయాలని విజ్ఙప్తి చేస్తున్నారు. కేటీఆర్ జిల్లాగా చెప్పుకునే రాజన్న సిరిసిల్లలో విద్యార్థినులపై ఇలా జరగడం చర్చకు దారితీస్తోంది.

read also: Armed Vigilante Groups: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ గ్రామస్థుల చేతికి ఆయుధాలు

గతేడాది ఫిబ్రవరిలో కరీంనగర్‌ పాలిటెక్నికల్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాగా..విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపాల్‌ వక్రమార్గం పట్టారని ఆరోపించారు. విద్యార్థకులను మానసికంగా శారిరకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పై అధికారులు చెప్పినట్టు వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ ప్రిన్సిపల్ రాంబాబు బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని ఆరోపించారు కరీంనగర్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు. అయితే.. కరీంనగర్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక.. విద్యార్థులకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు తెలిపింది. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రిన్సిపాల్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Armed Vigilante Groups: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ గ్రామస్థుల చేతికి ఆయుధాలు