Droupadi Murmu: పోచంపల్లిలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన.. చేనేతపై ముర్ము ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ద్రౌపది ముర్ము ఈ నెల 23 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చేరుకున్నారు. అక్కడ శ్రీరంజన్ వీవ్స్ ను సందర్శించి మగ్గం నేయడం, స్పిన్నింగ్, రీలింగ్ తదితర ప్రక్రియలను పరిశీలించారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శించారు. అనంతరం చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ, విక్రయాలపై ఆయా సంఘాలలతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు. అనంతరం
Read also: Tata Punch EV: టాటా నుంచి త్వరలో చీపెస్ట్ ఎలక్ట్రిక్ SUV
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
రాష్ట్రపతితో చేనేత కార్మికులు..
రాష్ట్రపతితో చేనేత కార్మికులు మాట్లాడారు. ఆజాది కా అమృత్ వేడుకల్లో భాగంగా తమ డబల్ ఇక్కత్ ప్రదర్శన చేసుకోవాల్సి రావడం అదృష్టమని డబల్ ఇక్కత్ లో నిపుణురాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం గ్రహీత భోగ సరస్వతి అన్నారు. నూలు యార్న్ సరిగ్గా సరైన సమయంలో అందడం లేదన్నారు. యార్న్ డిపో పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక లోక శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. చేతేతకు సంబంధించిన జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మమ్ములను కార్మికులుగా కాకుండా కళాకారులుగా గుర్తించాలని వేడుకొన్నారు. ఇక మరోవైపు కూరపాటి వెంకటేశం మాట్లాడుతూ.. ఇక్కత్ పట్టు చీరల అమ్మకాలకు ప్రచారం కల్పించాలని కోరారు. పోచంపల్లి పట్టు చీరలకు బ్రాండ్ కల్పించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.
Read also: Chennai Super Kings: ఎంఎస్ ధోనీ వారసుడి కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నాం!
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మాటలు..
చేనేత కార్మికులు వినతుల అంతరం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తుందన్నారు. పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ గుర్తింపు లభించిందన్నారు. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందించడం అభినందనీయమన్నారు. చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న అవార్డు గ్రహీతలందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలన్నారు. చేనేత కళ ఒకరి నుండి మరొకరికి వారసత్వంగా కొనసాగడం, గురు శిష్య బంధాన్ని ఏర్పరచడం అభినందనీయమన్నారు. చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం, అధికారులు మరింత చొరవ చూపాలన్నారు.
Chennai Super Kings: ఎంఎస్ ధోనీ వారసుడి కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నాం!
తాజావార్తలు
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!