Humanity: తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ – 4 పరీక్ష(Group-4 Exam) ప్రశాంతంగా జరిగాయి. పేపర్-1 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, పేపర్-2ను మధ్యాహ్నం 2:30 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. 8,180 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలవగా.. 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ – 4 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,846 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో తొలిసారి మండల కేంద్రాలలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
Read Also: Neha Sharma : సరికొత్త అందాలతో రెచ్చగొడుతున్న నేహా శర్మ…
అయితే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పోలీసులు మానవత్వం చాటుకున్నారు. గ్రూప్-4 పరీక్ష రాయడానికి భార్యభర్తలు ఇద్దరు వచ్చారు. కురవి మండల పెద్దతండాకి చెందిన జగ్గులాల్, సబితా దంపతులు 3 నెలల చిన్నారితో సహా పరీక్ష రాయడానికి వచ్చారు. చిన్నారి వాళ్ళ నాన్నమ్మ దగ్గర బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర తీసుకొని లాలించారు. అంతేకాకుండా మంచం తెప్పించి చెట్టుకింద పడుకోబెట్టారు.
తొర్రూరు పట్టణ కేంద్రంలో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులకు తోడుగా వచ్చిన వారికీ, అభ్యర్థుల పిల్లలను పట్టుకున్న వారికి.. బందోబస్త్ కోసం వచ్చిన తొర్రూరు పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా మానవత్వం చూపిన పోలీస్ సిబ్బందిని తొర్రూరు DSP రఘు, సీఐ సత్యనారాయణ, ఎస్సై, సీఐ అభినందించారు.