Site icon NTV Telugu

Gokul Chat Bomb Blast: హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు.. దోషులకు పదేళ్ల జైలు

Gokul Chat

Gokul Chat

Gokul Chat Bomb Blast: దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఎట్టకేలకు శిక్ష పడింది. వీరికి గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లతో సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒబేదుర్‌ రెహమాన్‌తో పాటు ధనీష్‌ అన్సారీ, అఫ్తాబ్‌ ఆలం, ఇమ్రాన్‌ఖాన్‌లకు ఎన్‌ఐఏ కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. గతంలో వివిధ పేలుళ్ల కేసులతో సంబంధం ఉన్న దోషులు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడి గందరగోళం సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ఈ నిషేధిత సంస్థ తరపున పనిచేస్తున్న ఈ నలుగురు సానుభూతిపరులు పేలుళ్ల కుట్రలో భాగమేనన్నారు. హైదరాబాద్, బెంగళూరు పేలుళ్లలోనూ ఈ నలుగురి హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ రుజువు చేసింది. వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలో వీరి పాత్ర ఉందని చెప్పారు. తగిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించారు.

Read also: Burj Khalifa Dosa: బుర్జ్ ఖలీఫా దోశ తిన్నారో వావ్ అనాల్సిందే !

ఆగస్ట్ 25, 2007న కోఠిలోని గోకుల్ చాట్ మరియు లుంబినీ పార్క్ వద్ద ముఠా బాంబు దాడులు చేసింది. ఈ క్రూరమైన మారణకాండలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. లుంబినీ పార్క్ పేలుడులో 9 మంది మృతి.. గోకుల్ చాట్ షాపు పేలుడులో 33 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరు వికలాంగులు మరియు ఇప్పటికీ జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్ నగర్‌లో జంట పేలుళ్లు జరిగాయి. రద్దీగా ఉండే ఆనంద్ టిఫిన్ సెంటర్‌తో పాటు బస్టాండ్‌లో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులు చేయగా.. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఎన్ఐఏ అప్పట్లో అరెస్ట్ చేసింది.
Student Suicide: నా పిల్ల నన్ను మోసం చేసింది.. ‘అమ్మా సారీ’ అంటూ సెల్ఫీ వీడియో..!

Exit mobile version