Site icon NTV Telugu

Family feuds: ఐరన్ రాడ్డుతో నడిరోడ్డుపై భార్యను కొట్టి చంపిన భర్త

Lunger House Police Station

Lunger House Police Station

Family feuds: ప్రస్తుత కాలంలో కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల వల్ల దంపతులు గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని కొంతమంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా.. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశంనగర్ లో అందరూ చూస్తుండగానే రోడ్డుపై భార్యను అతికిరాతకంగా చంపాడు భర్త. దీంతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అది చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. నగరంలో మహమ్మద్ యూసుఫ్ కు కరీనా బేగం తో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే సంవత్సరం నుండి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తు కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కాగా కొంతకాలంగా భర్త ఆమెను చంపాలని పన్నాగం పన్నాడు. ఎలాగైనా ఆమె ఒక్కటిగా కనిపిస్తే చంపేందుకు ప్లాన్‌ వేసుకున్నాడు.

Read also: Jagga Reddy: గవర్నర్‌ ప్రసంగంపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

చివరికి ఆ సమయం రానే వచ్చింది. ఇవాళ ఉదయం కాపు కాసి కరీమా బేగం స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఐరన్ రాడ్డుతో ఆమెపై ఒక్కసారిగా రోడ్డుపై అందరూ చూస్తుండగానే దాడి చేసి హతమార్చాడు. అక్కడనుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు యూసుఫ్‌ను అదుపులో తీసుకున్నారు. సదరు మహిళ కరీమా బేగం అక్కడికక్కడే మృతి చెందింది. కరీమా మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ ను సేకరిస్తున్నారు. ఆమెపై అనుమానంతో ఇలా చేశాడా? లేక భర్తను దూరం పెట్టినందుకు చంపేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Tension at Gandhi Bhavan: గాంధీభవన్‌ వద్ద ఉద్రికత.. షబ్బీర్ అలీ, మల్లు రవి అరెస్ట్

Exit mobile version