Site icon NTV Telugu

కొండత పెంచి పిసరంత తగ్గించారు: కేసీఆర్‌

కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పెరిగిన పెట్రోలు, డీజీల్‌ రేట్లపై మీడియా సమావేశంలో మాట్లాడారు. కొండత పెంచి పిసరంత తగ్గించారన్నారు. ట్యాక్సుల రూపంలో మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యాట్‌ ఎంత ఉం దో అంతే అమ లు చేస్తున్నామన్నారు. కేంద్రం అనుకుంటే రూ. 77 రూపాయా లకే పెట్రోల ఇవ్వొచ్చు. ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం ఇం ధన ధరలపై సెస్సు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరగని అం తర్జాతీయ పెట్రోలు ధరలను కేంద్రం పెంచి ప్రజలను మోసం చేస్తుం ది. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నందునే కంటితుడుపు చర్యగా ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించారు.

పెట్రోల్‌ ధరలు పెంచి ప్రజలకు భారం మోపారు. ఏ నైతికతతో తాము వ్యాట్‌ తగ్గించాలని కేంద్రం మాట్లాడుతోందని విమర్శించారు. 100 శాతం సెస్సులు పెట్టారు. పెట్రోలు ధరలు పెంచడం వల్ల పేదల జేబులకు చిల్లులు పెట్టాయి. దీంతో అన్ని నిత్యావసరాలు పెరిగాయి. ఎల్‌ఐసీ లాంటి సంస్థలను నిర్వీర్యం చేశారు. రాజ్యాంగబద్ధంగా సెం ట్రల్‌ ట్యాక్స్‌లో 40పర్సెంట్‌ రాష్ట్రాలకు ఇవ్వాలి కానీ దాన్ని కేంద్రం అమలు చేయడం లేదన్నారు. కేంద్ర మంత్రి తమ పాలసీ ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Exit mobile version