Site icon NTV Telugu

కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులు

ఓవైపు ఉద్యోగుల బదీలీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై హైకోర్టుకు వచ్చిన అప్పీళ్లపై స్పందించింది.కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు వివాదాలపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయుల పిటిషన్లపై విచారించిన హైకోర్టు దీనిపై ఉత్తర్వులు ఇస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసింది.

https://ntvtelugu.com/rewanth-reddy-said-the-government-should-think-about-employee-transfers/

ఉపాధ్యాయుల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపించాలని డీఈఓలకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అప్పీళ్లను సమర్పించిన ఉపాధ్యాయుల కేటాయింపును పున: పరిశీలన జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సీనియార్టీ, మెడికల్‌, తదితర అంశాల ఆధారంగా ఉద్యోగుల అప్పీళ్లను పరిశీలించాలని పేర్కొంది. ఈనెల 30 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది.

Exit mobile version