దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రభావం కూడా ఈ సారి గణతంత్ర వేడుకలపై పడింది. ఏకంగా వేదికనే మార్చే స్థితికి పరిస్థితి వచ్చింది. ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించేది కానీ రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ ఉన్న కారణంగా ఈ సారి వేదికను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ ఏడాది గణతంత్ర వేడుకలను గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది రాజ్ భవన్‌లోనే గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కాగా ఇంతకముందు ఎప్పుడు కూడా రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలను ప్రభుత్వం నిర్వహించలేదు.
Read Also: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది: బండిసంజయ్
