Site icon NTV Telugu

Election Commission: నగరంలో అడుగుపెట్టిన కేంద్ర ఎన్నికల బృందం.. సమీక్ష షురూ..

Election Commission

Election Commission

Election Commission: తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటించనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనుంది. మొత్తం 17 మంది అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సీఈసీ నేతృత్వంలోని బృందం సమీక్షించనుంది. ఇవాళ మధ్యాహ్నం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది. మరోవైపు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సీఈసీ బృందం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఓటర్ల జాబితా, ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది.

ఈసీ ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులను ఆహ్వానించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. అంతేకాదు రాజకీయ పార్టీల ఫిర్యాదులపై సమీక్ష నిర్వహిస్తారు. రేపు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది. ఎల్లుండి వికలాంగ ఓటర్లు ఓటు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సీఈసీ సమీక్ష నిర్వహించనుంది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ బృందం మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. డిసెంబర్ 13, 2018న BRS ప్రభుత్వం రద్దు చేయబడుతుంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ 12లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. డిసెంబర్ 12 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈసీ కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉంది.మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన ఈసీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Skanda: రామ్ పోతినేని 5 రోజుల్లో హాఫ్ సెంచరీ కొట్టేశాడు!

Exit mobile version