Site icon NTV Telugu

బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన కొనుగోళ్లు ఆపం: పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన కొనుగోళ్లు ఆపమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ ధాన్యం కొనుగోళ్లపై రాష్ర్టంలో అలజడి సృష్టిస్తుందన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌పై అనవసర విమర్శలు చేస్తుందని, విమర్శలు ఆపి కేంద్రాన్ని ధాన్యం కొనేలా ఒప్పించాలని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో 6,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే వీటి సంఖ్యను ఇంకా పెంచుతామని ఆయన తెలిపారు. రాష్ర్టంలో వరి ధాన్యం కొనుగోళ్లను బీజేపీ అడ్డుపడ్డా ధాన్యం కొనుగోళ్లను ఆపమని ఆయన స్పష్టం చేశారు.

బండి సంజయ్‌ ఎన్ని పాదయాత్రలు చేసిన ఆయనను ప్రజలు నమ్మరన్నారు. టీఆర్‌ఎస్‌పై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ఒక ఎన్నిక గెలవగానే తామే అంత అన్నట్టు రాష్ర్ట బీజేపీ నేతలు వ్యవహ రిస్తున్నారని పల్లా విమర్శించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రా లు అ న్ని చోట్ల ప్రారంభమయ్యాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు ఉన్న ధాన్యాన్ని ప్రభు త్వం కొనుగోలు చేస్తుందని, కానీ యాసంగిలో వేసే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయదని పల్లా స్పష్టం చేశారు. బీజేపీ నాయకుల మాటలు విని రైతులు ఆగం కావొద్దని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version