NTV Telugu Site icon

Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు నంది అవార్డ్స్‌.. తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani Srinivas: నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నంది అవార్డుల అంశంపై తలసాని స్పందించారు. నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. అని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ అడగలేదని చెప్పారు. కొందరు మీడియా చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని మంత్రి తలసాని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది సినిమాకు నంది అవార్డులు ఇచ్చేలా ఆలోచిస్తామని చెప్పారు. హైదరాబాద్ మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీలో దర్శక రత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Read also: KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్‌ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఈ సందర్భంగా నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కొందరు సినీ ప్రముఖులు చేస్తున్న విమర్శలపై మంత్రి తలసాని స్పందించారు. నంది అవార్డుల విషయంలో బాధ్యులైన వారెవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో సహకారం అందిస్తుందన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎన్నోసార్లు ప్రశంసించారని మంత్రి గుర్తు చేశారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడం, ఐదో షో ఆడేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా ప్రభుత్వం టాలీవుడ్‌కు అండగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులు నిలిచిపోయిన మాట వాస్తవమేనన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. “దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. చిత్రపురి కాలనీకి దాసరి ఎంతో కృషి చేశారు. సినీ పరిశ్రమ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ముందుకు సాగే వ్యక్తి దాసరి. ఆయన చిత్రాలు ఎంతో సందేశాత్మకంగా ఉన్నాయి. “దాసరి మరణానంతరం సినీ పరిశ్రమ దిక్కును కోల్పోయింది’’ అని మంత్రి తలసాని అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగల్లుకు మోసగాడు’ రీరిలీజ్ కానున్న సందర్భంగా నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇచ్చేందుకు ఇరు ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ అవార్డుకు విలువ ఉండేదన్నారు. ఇప్పుడు అవార్డుకు విలువ లేకుండా పోయిందన్నారు.