Site icon NTV Telugu

Talasani srinivas: కాంగ్రెస్, బీజేపీ నేతలకు తలసాని సవాల్.. అభ్యర్థులను ప్రకటించే దమ్ముందా?

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani srinivas: వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. కాచిగూడలోని తుల్జా భవానీ ట్రస్టుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. దమ్మున్న అధినేత కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ప్రకటించారు. వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పే ధైర్యం మాకు ఉంది. నువ్వు ఏం చేశావో చెప్పగలవా? అని డిమాండ్ చేశారు. బీజేపీకి అభ్యర్థులు లేరని, కాంగ్రెస్ పార్టీ పోరాటానికే పరిమితమైందని మండిపడ్డారు. కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపు తిరిగి వస్తారన్నారు.

Read also: Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరు..!

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం ఏడుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్‌ ఇవ్వబోమని కేసీఆర్‌ ప్రకటించారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల అభ్యర్థులు మారారు. ఈసారి రెండు చోట్ల పోటీ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే అభ్యర్థులను ఉన్నత స్థాయిలో ప్రకటించారు. కేవ‌లం 4 సీట్లు ప‌క్క‌న పెట్టి.. మిగిలిన 115 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించారు. గోషామహల్, నాంపల్లి, జనగామ, నర్పాపూర్ సీట్లను కేసీఆర్ పెండింగ్‌లో ఉంచారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించారు. స్థానిక నేతల కోరిక మేరకు గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదని వివరించారు. అక్టోబర్ 16న వరంగల్ లో భారీ ర్యాలీ ఉంటుందని.. అదే రోజు తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తానని కేసీఆర్ తెలిపారు.
Tollywood This Week: ఈ ఇద్దరి పరిస్థితేంటి రాజా?

Exit mobile version