TG ICET Result: నేడు తెలంగాణ ఐసెట్ ఫలితాలు వెల్లడి.. ఎన్ని గంటలకంటే?
- నేడు టీజీసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు
- ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల
- ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG ICET Result: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈరోజు అధికారులు ప్రకటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే, ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో పూర్తిస్థాయి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు ముందుగా ICET ర్యాంక్ కార్డ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి- https://icet.tsche.ac.in/. హోమ్ పేజీలో ‘డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్’ లింక్‌పై క్లిక్ చేయండి. అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ‘వ్యూ ర్యాంక్ కార్డ్’ బటన్‌పై క్లిక్ చేయాలి.
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
Read also: Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై కేసు నమోదు!
వివరాలు నమోదు చేయగానే కంప్యూటర్ స్క్రీన్‌పై ISET ర్యాంక్ కార్డు కనిపిస్తుంది. అభ్యర్థులు ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒక ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో ఉపయోగం కోసం ఉంచండి. కాగా, జూన్ 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్-2024 ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.దీంతో ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుంచి 86,156 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 77,942 మంది విద్యార్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు.
కాగా, మొత్తం హాజరు 90.47 శాతం. జూన్ 5న మొదటి సెషన్‌కు 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్‌లో 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జూన్ 6వ తేదీ ఉదయం జరిగిన చివరి సెషన్‌లో 28,256 మంది విద్యార్థుల్లో 25,662 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే తెలంగాణలో 16 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షను నిర్వహించారు. తెలంగాణ ఐసెట్-2024 ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..