TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- జూన్ 19 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రారంభం
- సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కీలక తేదీలు ఇవే
- వెబ్ ఆప్షన్స్, మాక్ అలాట్మెంట్ షెడ్యూల్ వివరాలు
- జూలై 10న తొలి విడత సీట్ల కేటాయింపు.. ఫీజు చెల్లింపు గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG EAPCET 2026 : తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ నెల 19వ తేదీ నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అర్హత సాధించిన విద్యార్థులు ఈ కాలపరిమితిలో తమ ర్యాంకులను బట్టి కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ నుండి సీట్ల కేటాయింపు వరకు ముఖ్యమైన తేదీలు
కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) జరుగుతుంది.
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవడానికి (వెబ్ ఆప్షన్స్) అవకాశం ఉంటుంది. విద్యార్థులు పెట్టుకున్న ఆప్షన్ల ఆధారంగా వచ్చే నెల 4వ తేదీన ‘మాక్ సీట్ అలాట్మెంట్’ (నమూనా సీట్ల కేటాయింపు) ప్రక్రియను నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులకు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనా వస్తుంది.
ఆప్షన్ల మార్పు, ఫీజు చెల్లింపు గడువు
మాక్ అలాట్మెంట్ చూసుకున్న తర్వాత, విద్యార్థులు తాము పెట్టిన వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకుంటే వచ్చే నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు మార్చుకునేందుకు (మోడిఫికేషన్) ప్రత్యేక అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత, వచ్చే నెల 10వ తేదీన మొదటి విడత అధికారిక సీట్ల కేటాయింపును పూర్తి చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 10వ తేదీ నుండి 14వ తేదీ లోపు నిర్దేశిత ట్యూషన్ ఫీజును చెల్లించి, ఆన్లైన్ ద్వారా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
-
AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!