Site icon NTV Telugu

నే సచ్చిపోతా అనుమతివ్వండి.. కేసీఆర్, కేటీఆర్ లకు పదో తరగతి విద్యార్థి విజ్ఞప్తి

కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను మీడియా ద్వారా కోరుతున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బాలుడు. తన అక్క, బావ వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నాడు. తనకు కారుణ్య మరణం కు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ మండలం లోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడి గా పని చేసేవాడు. అనారోగ్యంతో ఆయన మరణించడం తో ఆయన భార్య సుజాత కు అటెండర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆమెకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి,ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయి కి వివాహం కాగా అబ్బాయి 10 వ తరగతి చదువు తున్నాడు. గత సంవత్సరం లో అనారోగ్యంతో తల్లి సుజాత కూడా మరణించింది. అప్పటి నుంచి సాయి హుజూర్ నగర్ లో తన అక్క బావల వద్దే ఉంటున్నాడు.

ఈ క్రమంలో వారి అమ్మ ఉద్యోగం తో పాటు ఉన్న డబ్బులు తనకే కావాలంటూ సాయిని వాళ్ళ అక్క బావలు వేధింపులకు గురి చేస్తున్నారని సాయి ఆవేదన వ్యక్తం చేశాడు. రోజు రోజు కు వేధింపులు తట్టుకోలేక హుజూర్ నగర్ నుంచి నేలకొండపల్లి కి వచ్చిన సాయి తనే సొంతంగా కిరాయి ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. అయినా తన అక్క, బావఫోన్ చేసి వేధిస్తున్నారని ఇక తాను బ్రతకలేనని తనకు ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేదని అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ కు మీడియా ద్వారా కోరుతున్నాడు. తన మరణానికి కారణ మవుతున్న తన అక్క,బావ లపై చర్యలు తీసుకోవాలని సాయి కోరుతున్నాడు.

Exit mobile version