NTV Telugu Site icon

Constables Families Protest: కొనసాగుతున్న కానిస్టేబుల్స్ భార్య నిరసన.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళన

Police Protest

Police Protest

Constables Families Protest: తెలంగాణ పోలీసుల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బెటాలియన్‌ పోలీసులు సీఎం రేవంత్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నాగార్జున సాగర్ హైవేపై బెటాలియన్ పోలీసు కుటుంబాలకు, స్థానిక పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్క సరిగా ఉదృతంగా మారడంతో సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాయింది.

Read Also: Pattikonda Love Story: నిన్న పెళ్లి మండపం నుంచి పరార్.. నేడు ప్రియుడితో కలిసి పీఎస్‌లో ప్రత్యక్షం..

అలాగే, నల్లగొండలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సిబ్బంది మరోసారి నిరసన చేస్తున్నారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపించిన కానిస్టేబుల్స్ సిబ్బంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు వేయడంతో కానిస్టేబుల్స్ భార్యలు బయటకు రాకుండా ఆగిపోయారు.

Read Also: Jagtial: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ సమావేశం..

ఇక, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు ధర్నాకు దిగారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు డ్యూటీలు వేసి మా సంసారాన్ని కుటుంబానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారు.. అలాగే, పెద్ద అధికారుల ఇళ్లలో పాచి పనులు, బొల్లు తోమడం, ఇళ్లు ఊడవడం, పిల్లలను స్కూల్ కి పంపడం, మందు తాగి పబ్బులో పడిపోతే తీసుకురావడంలో లాంటి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. మాపై ఆంధ్ర అధికారుల పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.. రోడ్డెక్కిన కానిస్టేబుల్స్ భార్యలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Read Also: Chiranjeevi : మెగాస్టార్ 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఫోటో వైరల్

బెటాలియన్ కుటుంబ సభ్యుల డిమాండ్స్
* మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలి..
* ఏక్ పోలీస్ విధానం అమలయ్యే వరకు ఫ్యామిలీ వెల్ఫేర్ సోషల్ పాటు కల్పించాలి
* బ్రిటిష్ కాలం నాటి విధానాలను ప్రస్తుత కాలానికి మార్చాలి..
* ఓకే చోట ఐదు సంవత్సరాలు పోస్టింగ్ ఇచ్చి, కుటుంబాలకు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి
* బెటాలియన్ వ్యవస్థలో ఫటిక్ పేరుతో చేసే వెట్టి చాకిరీ నశించాలి
* ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుండి విముక్తి కల్పించాలని డిమాండ్
* హోంశాఖ మీ చేతుల్లోనే ఉంది.. తమ బ్రతుకులు కూడా సీఎం చేతుల్లోనే ఉన్నాయ్ అంటూ నినాదాలు ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు.