TS Police Recruitment: ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులకు బీజేవైఎం శ్రేణుల మధ్య తోపులాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Police Recruitment: పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం నేతలు గురువారం ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు వచ్చిన బీజేవైఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయినా బీజేవైఎం శ్రేణులు ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. బీజేవైఎం శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానిస్టేబుళ్ల నియామకాల విషయంలో గతంలో ఉన్న నిబంధనలనే కొనసాగించాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.
Read also: Ajith Vs Vijay: తగ్గేదే లే అంటున్న ‘దిల్’ రాజు!
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
కాగా..ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో ఈవెంట్స్ ముగియనున్నాయి. దీంతో తుది రాత పరీక్ష నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) దృష్టి సారించింది. ఇక.. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు తుది రాతపరీక్షలు నిర్వహించేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ప్రైమరీ రాతపరీక్షలో వలే అర్హత మార్కులు తగ్గించే అవకాశాలున్నాయా? అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. దీంతో.. గతంలో జనరల్ అభ్యర్థులకు 80.., బీసీలకు 70.., ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులకు 60 అర్హత మార్కులుగా ఉండేవి. కానీ.. నియామక ప్రక్రియపై గతేడాది ఏప్రిల్ 25న వెలువడిన నోటిఫికేషన్లో మాత్రం ప్రైమరీ రాతపరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల అభ్యర్థులకూ 60 మార్కులుగానే నిర్ణయించారు.
Read also:woman falls into septic tank: సెప్టిక్ ట్యాంక్‌లో పడి 41 ఏళ్ల మహిళ మృతి
ఈనేపథ్యంలో.. పైమరీ రాతపరీక్ష ఫలితాలు వెల్లడించే తరుణంలో దీనిపై ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. సీఎం ఆదేశాల మేరకు కటాఫ్ మార్కుల్లో మార్పులు చేశారు. జనరల్ అభ్యర్థులకు 60.. బీసీ అభ్యర్థులకు 50.. ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులకు 40 కటాఫ్ మార్కులుగా ఖరారు చేసి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల్ని ప్రకటించారు. కాగా..తుది రాతపరీక్షలోనూ కటాఫ్ మార్కుల తగ్గింపుపై ఊహాగానాలు రావడంతో.. అలాంటి అవకాశం లేదని జనరల్ అభ్యర్థులు 80, బీసీ అభ్యర్థులు 70, ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు 60 మార్కులు సాధిస్తేనే అర్హత సాధిస్తారని పోలీస్ నియామక మండలి స్పష్టం చేసింది.
Read also:Suryanarayana Raju: బీజేపీకి ఎవరూ రాజీనామా చేయలేదు..
అయితే.. ప్రైమరీ రాతపరీక్షలో 5 తప్పుడు సమాధానాలకు ఒక మార్కును తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో.. తుది రాతపరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు కాబట్టి రెండు విడతల పరీక్షల్లో ప్రశ్నపత్రాలు బహుళైచ్ఛిక సమాధానాలతో కూడినవే అవడంతో మండలి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రైమరీ రాతపరీక్షలో నెగెటివ్ మార్కుల విధానంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇటు ఈవెంట్స్‌లోనూ అర్హత సాధించగలిగితేనే సత్తా ఉన్నట్లుగా పరిగణించి తుది రాతపరీక్షలో నెగెటివ్ మార్కుల విధానాన్ని తీసివేసినట్లు మండలి పేర్కొంది..అన్ని వర్గాల అభ్యర్థులు అర్హత మార్కుల్ని సాధిస్తేనే తుది ఎంపిక ప్రక్రియ కోసం పరిగణనలోకి తీసుకుంటామని మండలి ప్రకటించింది.
Sonu Sood: సోనూసూద్‌పై నార్త్ రైల్వే ఆగ్రహం.. ఇంకోసారి అలా చేయొద్దంటూ వార్నింగ్
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!