NTV Telugu Site icon

Yadadri: కొండ‌పై అనుమ‌తించండి.. పర్మిషన్ లేదు.. ఆందోళ‌న‌.. అరెస్ట్‌

Yadadri

Yadadri

యాదాద్రి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యాదగిరిగుట్టలో ఆటో కార్మికులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే ఆటో కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో ఇవాళ ఆటో సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కొండపైకి ఆటోలను నిషేధించడంతో.. జీవనోపాధి కోల్పోయామని ఆటో కార్మికుల ఆందోళన వ్యక్తం చేశారు. కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో కార్మికుల డిమాండ్ చేశారు.

అయితే.. 2022 మార్చి 31న యాదాద్రి కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతిలేదని, ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించరని.. ఈ నిర్ణయం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వస్తుందని ఆలయ ఈవో గీతారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. యాదాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్దం కింద నుంచి ఉచితంగా బస్సులను నడపనున్నారని స్పష్టం చేసారు. కొండ దిగువ నుండి పైకి, మళ్ళీ కొండ పై నుంచి కిందకు ప్రయాణం బస్సుల్లో ఉచితమేనని తెలిపారు. ఇందుకు ఆర్టీసీకి అయ్యే ఖర్చును దేవస్థానమే భరిస్తుందని ఈ విషయాన్ని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపిన మార్చిలోనే తెలిపారు. కాగా పైకి అనుమతించక పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని జీవనోపాధి కోల్పోతామని వాహన దారులు ఆందోళన చేపట్టారు. కాగా.. కొండపై భక్తుల సౌకర్యార్థమే వాహనాలు అనుమతించమని స్పష్టం చేశారు అధికారులు.

అయినా కూడా కొందరు వెహికల్స్ లను కొండపై తీసుకు రావడంతో.. దానిపై పార్కింగ్ నిబంధనలను పెట్టారు అధికారులు. మే 4 నుంచి యాదాద్రి కొండ‌పైకి వెళ్లే వాహ‌నా‌లకు గంటకు రూ.500 రుసుం వసూలు చేయ‌ను‌న్నట్టు ఆలయ ఈవో ఎన్‌ గీత ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. నిత్యం 50 నుంచి 70 వాహ‌నాలు కొండ‌పైకి వస్తు‌న్నట్టు గుర్తిం‌చిన అధి‌కా‌రులు ఇటీ‌వల నిర్వ‌హిం‌చిన సమీక్షా సమా‌వే‌శంలో ఈ నిర్ణయం తీసు‌కు‌న్నట్టు వెల్ల‌డిం‌చారు. కొండ‌పైకి వాహ‌నాల అను‌మ‌తికి గంటకు రూ.500 రుసుం‌తో‌పాటు గంట దాటితే ప్రతి గంటకు అద‌నంగా రూ.100 వసూలు చేయ‌ను‌న్నట్టు స్పష్టం‌చే‌శారు. కొండ‌పైన స్థలా‌భావం కార‌ణంగా అధిక సంఖ్యలో వాహ‌నా‌లకు కొండ‌పైకి చేర‌కుండా నివా‌రిం‌చేం‌దుకు ఈ ఉత్త‌ర్వులు జారీ చేస్తు‌న్నట్టు వివ‌రిం‌చారు. అయితే అద‌నంగా రూ. 100 వ‌సూలు చేసే నిబంధ‌న‌ను ఎత్తివేశారు.

ఏది ఏమైనా కొండపైకి వాహనాలు అనుమతి లేదని , ఒకవేళ వాహనాలు నిబంధనలు అతిక్రమించి కొండపైకి వస్తే వారికి పార్కింగ్ 500 రుసుం చెల్లించాలని వెల్లడించారు. దీంతో వాహనదారులు వచ్చే డబ్బులు పార్కింగ్ కే వెలుతున్నాయని పైవేట్ వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి. పార్కింగ్ సురుమును తగ్గించాలని, ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించాలని కోరుతున్నారు. లేదంటే కుటుంబాన్ని పోషించుకునేందుకు భారంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.

Weight Lifting: భారత్‌కు రెండు రజతాలు.. సత్తా చాటిన లిఫ్టర్లు