Adilabad Rims: ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రి వద్ద నిన్న ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలోకి చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దుండగుల్లో కొందరు రౌడీ షీటర్లు ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం వైద్య విద్యార్థులకు, దుండగులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వైట్ కలర్ క్రెటా, బండ్లపై వచ్చిన దుండగులు వైద్య విద్యార్థులను దారుణంగా కొట్టారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి విధులను నిలిపివేశారు. అయితే ఇవాళ కూడ జూడాలు విధులకు దూరంగా ఉన్నారు. అత్యవసర సేవలు తప్పా మిగతా సేవలకు హాజరు కాబోమని వెల్లడించారు. ఇప్పటికే వైద్య విద్యార్థుల పై దాడి చేసిన వారి లో 5 మంది రిమాండ్ కు తరలించారు పోలీసులు. డైరెక్టర్ పైనా కేసు నమోదు చేసిన పోలీసులు.రౌడీ షీటర్ లతో రిమ్స్ హాస్టల్స్ ఆవరణ లోకి వెళ్ళి దాడి చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ ను ఉన్నతాధికారులు టర్మినెట్ చేసారు. రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ ను తొలగించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో హాస్టల్స్ నుంచి కాలేజి, ఆసుపత్రి వైపు వైద్య విద్యార్థులు రానున్నారు. అయితే ఆసుపత్రి, కాలేజీ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఎవరిని ఆసుపత్రి లోపలికి అనుమతించడంలేదు. పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: Yadadri : యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ.. భారీగా పెరిగిన స్వామివారి ఆదాయం..
నిన్న ఆదిలాబాద్ రిమ్స్ క్యాంపస్‌లోకి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారని వైద్య విద్యార్థులు తెలిపారు. బయటి వ్యక్తులు గొడవ పెట్టుకోవడమే కాకుండా తమపై ఎలాంటి హెచ్చరికలు చేయకుండా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా రిమ్స్ అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థులు రిమ్స్ లో విధులు బహిష్కరించారు. దర్శకుడు దుండగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత విద్యార్థులు ప్లకార్డులు, దిష్టి బొమ్మతో రిమ్స్ వైద్య కళాశాల వరకు ర్యాలీ ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎమర్జెన్సీ విభాగం ఎదుట నిరసన తెలిపారు. అయితే రిమ్స్ లో మెడికోల పై దాడి చేసిన వారి పై కేసు నమోదు చేశామని సిఐ అశోక్ అన్నారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రాత్రి రిమ్స్ క్యాంపస్ లోకి వచ్చిన వారిలో ఇద్దరు రౌడీ షీటర్ లు ఉన్నారని స్పష్టంచేశారు. వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గొడవ కంటే ముందు రిమ్స్ డైరెక్టర్, మెడికో ల మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసిందన్నారు. పూర్తి స్తాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్