NTV Telugu Site icon

Tension in Osmania university: ఓయూలో ఉద్రిక్తత.. జేఏసీ నాయకుల అరెస్ట్‌

Ou

Ou

JAC leaders arrested: హైదరాబాద్‌ లోని ఉస్మానియా కాలేజ్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు నిరుద్యోగ మార్చ్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిర్యుద్యోగ మార్చ్‌కు జేఏసీ పిలుపు మేరకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు. మరో పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా జేఏసీ నాయకులను అదుపులో తీసుకున్నారు. దీంతో నేడు, రేపు క్యాంపస్ లో హై అలెర్ట్ ప్రకటించింది.

Read also: Inspector : హెల్ప్ చేస్తాడని స్టేషన్ కెళ్తే.. రూంకి రమ్మన్న ఇన్ స్పెక్టర్

TSPSC పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకు విద్యార్థులు ప్లాన్ చేశారు. దీక్షకి యూనివర్సిటీ అధికారులు పర్మిషన్ లేదన్నా.. ఒక వేళ దీక్ష చేస్తే ఓయూ పోలీసులు కేసులు పెడతామన్నా అవన్నీ పెడచెవిన పెట్టిన విద్యార్థి సంఘాలు దీక్ష చేసి తీరుతామని ఇవాళ దీక్షకు దిగాయి. ఈనేపథ్యంలో.. క్యాంపస్ లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామన్న అధికార పార్టీ విద్యార్థి సంఘం ప్రకటించింది. ప్రతిపక్ష నాయకుల రాకను విప్లవ వామపక్ష విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నామన్నారు. TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు. జ్యూడిషియల్ విచారణకి విద్యార్థులు పట్టుపడుతున్నారు. ఈనేపథ్యంలో.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రంగంలోకి దిగిన ఓయూ పోలీసులు ముందస్తుగా విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. ముందస్తు అరెస్ట్ లపై ఓయూ విద్యార్థులు భగ్గుమన్నారు. క్యాంపస్ కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేశారు. ఎవరిని లోనికి అనుమతించడంలేదు.
IPL 2023 : ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు రోహిత్ రిక్వెస్ట్