Site icon NTV Telugu

Tension in Osmania University: ఓయూలో ఉద్రిక్తత.. వీసీ ఛాంబర్ అద్దాలు ధ్వంసం

Tension In Osmania University

Tension In Osmania University

Tension in Osmania University: హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. ఓయూ హాస్టల్ కేటాయింపులో వీసి నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈసందర్భంలో ఓయూ వీసీ ఛాంబర్ లోకి చొచ్చుకొని వెళ్లేందుకు నిజాం కాలేజీ పీజీ విద్యార్థులు యత్నించారు. ఈ నేపథ్యంలో వీసీ ఛాంబర్ అద్దాలు, పలు సామాగ్రి ద్వంసమయ్యాయి. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

Read also:Thopudurthi Prakash Reddy: టీడీపీ హయాంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదు.. చీకటి ఒప్పందాలు

ఓయూలో హాస్టల్స్ వెంటనే కేటాయించాలంటూ విద్యార్థుల ఆందోళ చేశారు. ఇందులో భాగంగానే నేడు ఓయూ పరిపాలనా భవనంలోకి విద్యార్థులు చొచ్చుకు వచ్చారు. ఇక, పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే.. E2 హాస్టల్ విద్యార్థులు మెస్ హాస్టల్ కోసం అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి వెళ్ళేక్రమంలో విద్యార్థులకు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. ఇక, ఈ తోపులాటలో పీడీఎస్ యూ సెక్రటరీ ప్రవీణ్ అనే విద్యార్థికి తీవ్ర రక్త స్రావం అయింది. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Facebook New Updates : ఫేస్ బుక్ యూజర్లు కచ్చితంగా తెలుసుకోవాలి.. మీ ప్రొఫైల్ మారుతోంది

Exit mobile version