NTV Telugu Site icon

Solar Eclipse: రేపటి నుంచి బుధవారం ఉదయం వరకు దర్శనాలు బంద్‌

Solar Eclipse

Solar Eclipse

Solar Eclipse: సూర్యగ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8.50 గంటల నుంచి 26 గంటల వరకు ఆలయంలోకి ప్రవేశం ఉండదని ప్రకటించారు. గ్రహణం కారణంగా నిత్య, సత్సవ కల్యాణం, సత్సవ బ్రహ్మోత్సవాలు కూడా రద్దయ్యాయి. 26న నిర్వహించే శతఘట్టాభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించబోమని అధికారులు ప్రకటించారు. బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 10 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Read also: Bandi Sanjay: జీఎస్టీ పెంచాలన్నది కేటీఆరే..! కౌంటర్‌ ఇచ్చిన బండి సంజయ్‌

ఇక, గ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. రేపు ఉదయం 8.30 గంటల నుంచి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6 గంటలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మంగళవారం మూతపడనున్నాయి. బుధవారం భక్తులకు మళ్లీ దర్శనం కల్పించనున్నారు.
KTR Tweet: టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలి.. కేటీఆర్‌ ఆసక్తికర ట్విట్‌..