ఆదిలాబాద్‌లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. దాదాపు ఏజెన్సీ అన్ని ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి.దట్టమైన మంచు పొగ మంచు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.
రోజు వారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదయం పూట పనుల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. కొమురం భీం జిల్లా గిన్నెదరిలో 9 డిగ్రీలు, సిర్పూర్ యూ లో 9.4. డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 9.7, అర్లిటి లో 9.8 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇవే ఇప్పటి వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
