High Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు భగ్గు మంటున్నాయి. ఎండ వేడిమికి చాలా ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె రాకముందే ఎండలతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక దేశంలోనే ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొత్తగూడెంలో నమోదయ్యాయి. తెలంగాణలో 8 జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చేవారం రోజులు తెలంగాణలో తీవ్ర వడగాలులు, పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read also: Dead Boy Detectives OTT: ఓటీటీలో వచ్చేసిన థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగంటే?
రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత 45.5 డిగ్రీలకు చేరుకుంది. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీలు, కడప జిల్లా ఖాజీపేటలో 45.3, పల్నాడు జిల్లా మాచర్లలో 45.2, కర్నూలు రూరల్‌లో 44.9, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.6, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.2, మన్యం సాలూరులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 41 మండలాల్లో భారీ వర్షాలు, 116 మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 183 మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Read also: Ponguleti Srinivasa Reddy: ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నాం..
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగుతుందని, వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రానున్న నెలలో మరింత వేడి గాలులు మరియు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
B Vinod Kumar: కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్, వినోద్ కుమార్ మధ్యనే పోటీ..