High Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు భగ్గు మంటున్నాయి. దేశంలోనే ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొత్తగూడెంలో నమోదయ్యాయి. ఎండ వేడిమికి చాలా ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.
దేశంలో కురుస్తున్న వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతోంది. ఇదిలా ఉండగా, మే నెలలో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం కనిపిస్తుంది.