NTV Telugu Site icon

Temperature Dropped: వణికిస్తున్న చలి.. రికార్డు స్థాయిలో పడిపోతున ఉష్ణోగ్రతలు

Temperature Dropped

Temperature Dropped

Temperature Dropped: రాష్ట్రంలో కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ప్రజలు గజ జ వణుకుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇక మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో జనం ఇల్లు విడిచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకు కూడా పొగ మంచు వీడటం లేదు. మరో ఐదు రోజుల వరకూ అంటే సంక్రాంతి వరకు చలి ఇట్లనే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగింది. అంతేకాకుండా ఈజిల్లాల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కామారెడ్డి జిల్లా డొంగ్లీలో అత్యల్పంగా 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Read also: IND Vs SL: నేటి నుంచి వన్డే సిరీస్.. టీమిండియా బోణీ కొట్టేనా?

ఇక ఈరోజులు ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే జనం జంకుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 7.5 కాగా, అల్మాయిపేట, సత్వార్ 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత కాగా.. మెదక్ జిల్లా కౌడిపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక దిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పంజా విసురుతుంది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడి పోయాయి. మూడు రోజులుగా చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరింది. కొమురం భీం జిల్లాలో 6.5గా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 6.5 నమోదైంది. నిర్మల్ జిల్లా 7.9 కాగా.. మంచిర్యాల జిల్లాలో 9.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది.

Read also: Stray Dog Attacks: ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కదాడి..

భాగ్యనగరంలో ఈనెల 6 నుంచి ఉదయం పలు చోట్ల పొగమంచు, మబ్బులు కమ్మకోవడంతోపాటు వర్షం కురియడంతో.. చలి తీవ్రత పెరిగింది. ఈసంవత్సరంలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్‌ లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు మారిపోవడంతో.. ఐదు రోజుల్లో రాష్ట్రంలో 10 డిగ్రీలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ లో 15 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావారణ శాఖ అంచనా వేసింది. దీనికి భిన్నంగా ఒక్కసారగా ఆదిలాబాద్‌ లో 6, హైదరాబాద్‌ 11.3 డిగ్రీలకు రికార్డు స్థాయిలో టెంపరేచర్‌ పడిపోయింది.