సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు సీసీఎస్ పోలీసులు.. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ముగ్గురు కోసం వేట ప్రారంభించారు.. తెలుగు అకాడమీలో మొత్తం రూ.63.47 కోట్లను నగదు రూపంలో విత్ డ్రా చేశారు.. ఆ ముగ్గురు నిందితులు.. ఇన్నవో కారులో ఆంధ్రతో పాటు ఇతర ప్రాంతాలకు డబ్బులు తరలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.. డబ్బులు కొల్లగొట్టడంలో ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్.. సహకరించినట్టు తెలుస్తోంది.. దీనికోసం 10 శాతం కమీషన్ రూపంలో రూ.6 కోట్లకు పైగా ప్రధాన నిందితుడిగా ఉన్న మస్తాన్వలి చెల్లించినట్టు సమాచారం.. రాజు కుమార్ సహా ఇద్దరితో ఆంధ్రప్రదేశ్ క్రెడిట్ సొసైటీ తెలుగు అకాడమీ పేరుతో అగ్రసేన బ్యాంకులో ఉన్న అకాడమీ డబ్బులను సొసైటీ ఖాతాకు మళ్లించారు..
ఇక, త్రిసభ్య కమిటీ విచారణలో తమ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలి.. అకాడమీ డబ్బులు డబ్బు మొత్తం కొట్టేసినట్టుగా అంగీకరించారు యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు… గతేడాది నుండే అకాడమీ డబ్బు కొట్టేసేందుకు పథకం రచించినట్టుగా చెబుతున్నారు.. గతేడాది చివరల్లో ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణతో కలిసి నిధులు కొట్టేసే పథకం అమలు చేస్తూ వచ్చాడు.. ది ఆంధ్ర ప్రదేశ్ ఎన్సీఎస్ తెలుగు అకాడమీ పేరుతో అగ్రసేన్ బ్యాంకులో బిజినెస్ అకౌంట్ తెరిచిన సొసైటీ చైర్మన్… ఈ ఏడాది జనవరి 2వ వారం నుండి సెప్టెంబర్ 18 వరకు సొసైటీ ఖాతాకు మొత్తం రూ.63.47 కోట్ల తెలుగు అకాడమీకి చెందిన మొత్తాన్ని నగదు రూపంలో విడుదల చేశారు సొసైటీ మేనేజర్లు పద్మావతి, మొహిద్దిన్.. ఇక, అకాడమీ నుండి నెల రోజుల సీసీ ఫొటోస్ హార్డ్ డిస్క్ ను ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ స్వాధీనం చేసుకుంది.. మొత్తంగా తెలుగు అకాడమీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.