Site icon NTV Telugu

KCR National Party Live Updates: తెలంగాణ గడ్డపై జాతీయ పార్టీ లైవ్‌ అప్‌డేట్స్..

Brs

Brs

టీఆర్ఎస్‌ పార్టీని స్థాపించి.. సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు.. దాని కోసం.. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్‌ ఎన్నికల గుర్తు, ఇప్పటికే వాడుతున్న గులాబీ రంగులను కొనసాగిస్తూ.. పార్టీ పేరును మాత్రం మార్రచేస్తున్నారు.. అనేక పేర్లు పరిశీలించిన చివరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కు ఆయన మెగ్గు చూపినట్టు తెలుస్తోంది.. తెలంగాణ గడ్డపై ఆవిర్భవిస్తోన్న ఆ కొత్త పార్టీకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం

The liveblog has ended.
  • 05 Oct 2022 02:32 PM (IST)

    కేంద్రం అన్ని రంగాల్లో ఫెయిల్..

    కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్‌ అయ్యిందని ఆరోపించారు కేసీఆర్.. టీఆర్ఎస్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలని ఆకాక్షించారు.. బంగ్లాదేశ్ కంటే భారత్‌ వెనకపడటం ఎంటి ? అని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. మహారాష్ట్ర నుంచి మొదలు పెడదాంజజ కర్ణాటకలో మన జెండా ఎగరాలన్నారు.

  • 05 Oct 2022 01:49 PM (IST)

    ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్‌ తీర్మానం...

    తెలంగాణ భవన్‌ వేదికగా జరిగిన టీఆర్ఎస్‌ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్‌ పార్టీని భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్‌)గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని ... ఎన్నికల కమిషన్‌కు పంపారు ఆ పార్టీ నేతలు..

  • 05 Oct 2022 01:37 PM (IST)

    ఇక భారత్‌ రాష్ట్ర సమతి

    తెలంగాణ గడ్డపై నవ శకం మొదలైంది... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్‌ పార్టీ.. ఇప్పుడు భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీగా మారిపోయింది... జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గులాబీ దళపతి కె.చంద్రశేఖర్‌రావు.. దానికి ఆమోదం పొందేలా చేశారు.. టీఆర్ఎస్‌ పార్టీని బీఆర్ఎస్‌ పార్టీగా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం ఆమోదం తెలిపింది.. ఇక, టీఆర్ఎస్‌ పేరు బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు సీఎం కేసీఆర్.

  • 05 Oct 2022 01:17 PM (IST)

    కాసేపట్లో జాతీయ పార్టీ ప్రకటన..

  • 05 Oct 2022 01:16 PM (IST)

    టీఆర్ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ తీర్మానం

    తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ సర్వసభ్య సమావేశం కొనసాగుతోంది.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కొనసాగుతోన్న ఈ సమావేశంలో టీఆర్ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు ఎమ్మెల్యేలు..

  • 05 Oct 2022 12:22 PM (IST)

    గుజరాత్‌లో కూడా పోటీ చేస్తాం..

    బీఆర్ఎస్‌ గుజరాత్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. ప్రధాని మోడీ పోటీచేసిన చోట కూడా మా పార్టీ పోటీ చేయబోతుందన్నారు..

  • 05 Oct 2022 12:19 PM (IST)

    కేసీఆర్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభం..

    తెలంగాణ భవన్‌ వేదికగా గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్‌ సర్వసభ్య సమావేశం ప్రారంభం అయ్యింది.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు.. తీర్మానికి మధ్యాహ్నం 1.19 ముహూర్తంగా పెట్టుకున్నారు సీఎం కేసీఆర్

  • 05 Oct 2022 12:12 PM (IST)

    ప్రగతి భవన్‌ దగ్గర టపాసుల మోత..

    జాతీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్.. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం కాన్వాయ్ పై పూలు చల్లారు కార్యకర్తలు... ప్రగతి భవన్ ముందు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చాయి టీఆర్ఎస్‌ శ్రేణులు.. కేసీఆర్‌ కాన్వాయ్‌ వెళ్లే సమయంలో.. పూల వర్షం కురిపిస్తూ.. టపాసుల మోత మోగించారు..

  • 05 Oct 2022 12:10 PM (IST)

  • 05 Oct 2022 12:09 PM (IST)

    కేసీఆర్‌ కాన్వాయ్‌పై పూల వర్షం..

    ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరారు సీఎం కేసీఆర్.. ఇక, ఈ సందర్భంగా సీఎం కాన్వాయ్ పై పూలు చల్లారు కార్యకర్తలు... ప్రగతి భవన్ ముందు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చాయి టీఆర్ఎస్‌ శ్రేణులు..

  • 05 Oct 2022 12:07 PM (IST)

    తెలంగాణ భవన్ కు బయలుదేరిన కేసీఆర్

    ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ఆయనతో పాటు జేడీఎస్ ముఖ్య నేత కుమార స్వామి, తమిళనాడు ముఖ్య నేత తిరుమల వలన్, పలు రాష్టాల నేతలు కూడా ఉన్నారు.

  • 05 Oct 2022 11:57 AM (IST)

    అథితులకు కేసీఆర్ అల్పాహార విందు

  • 05 Oct 2022 11:46 AM (IST)

    మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ పేరు ప్రకటన

    తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కేసీఆర్‌ ఎంతోకాలంగా చెబుతూ వస్తున్న జాతీయ పార్టీ పేరు ప్రకటనకు సమయం ఖరారైంది.. మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్ఎస్‌ పార్టీ పేరు మార్పు, కొత్త పేరు ప్రకటన ఉంటుంది

  • 05 Oct 2022 11:44 AM (IST)

    తెలంగాణ భవన్‌కు ప్రతినిధులు

    కాసేపట్లో తెలంగాణ భవన్‌ వేదికగా సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు.. ఇప్పటికే 283 మంది ప్రతినిధులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

Exit mobile version