NTV Telugu Site icon

Kishan Reddy Open Letter to CM KCR: సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి మరోసారి బహిరంగ లేఖ..

Kishanreddy Kcr

Kishanreddy Kcr

సీఎం కేసీఆర్ కు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి బ‌హిరంగ లేఖ రాసారు. రామగుండంలో వంద పడకల ESI ఆస్పత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని లేఖలో పేర్కాన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తానన్న ప్రస్తుత భూమి, ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తానన్న భూమిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను లేఖతోపాటు సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి పంపించారు. అయితే.. రామగుండంలో వంద పడకల ESI ఆస్పత్రి నిర్మాణానికి భూమిని కేటాయించాలని, అయితే.. గతంలోనే కిషన్ రెడ్డి సీఎంకు లేఖ రాశారు.

అయితే.. ఈనేపథ్యంలో, రామగుండం శివారులో ఐదెకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఆ భూమిపై ESI అధికారులు.. నిపుణులు సర్వే చేశారు. ఈనేపథ్యంలో.. ఆ భూమిని గతంలో మున్సిపాల్టీ డంప్‌ యార్డ్‌గా వినియోగించారని ఆ సర్వేలో గుర్తించినట్లు పేర్కొన్నారు కిషన్‌రెడ్డి. అంతేకాకుండా.. కేటాయించిన భూమి పక్కనే రెండు శ్మశాన వాటికలు ఉన్నాయని పేర్కొన్నారు. దానికి చేరుకోవడానికి నేరుగా దారి లేదని నిపుణుల నివేదికలో స్పష్టం చేశారని కిషన్‌ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా గుర్తుచేశారు.

Hyderabad Metro : ఇన్‌స్టా అమ్మాయి డ్యాన్స్.. ప్రజలకు హైదరాబాద్ మెట్రో స్ట్రాంగ్ నోటీసు

Show comments